ఇంజెక్షన్ వెగోవీ
-
డాక్టర్. అమర్ వెన్నపూస

బరువును తగ్గించడానికి వెగోవీ® ఇంజెక్షన్

వెగోవీ® (సెమాగ్లుటైడ్) ఇంజెక్షన్ అనేది నోవో నార్డిస్క్ కంపెనీ తయారు చేసిన మందు. దీర్ఘకాలం బరువు తగ్గించడానికి ఇండియాలో DCGI, అమెరికాలో FDA ఆమోదం పొందింది. తక్కువ కేలరీల ఆహారం, ఎక్కువ వ్యాయామంతో కలిపి 12 ఏళ్లు పైబడిన వారిలో బరువు తగ్గించడానికి సహాయం చేస్తుంది. ఇది ఊబకాయం ఉన్న పెద్దల్లో గుండెపోటు, స్ట్రోక్, ప్రాణహానిని తగ్గిస్తుంది.

బరువు నియంత్రణకు వెగోవీ® ఇంజెక్షన్ ని:

– BMI 30+ లేదా BMI 27 మరియు డయాబెటిస్, రక్తపోటు, కొలెస్ట్రాల్ వంటి సమస్యలు ఉన్న పెద్దలకు.

– 12 ఏళ్లు పైబడి పిల్లల్లో 95% పర్సెంటైల్ పైగా బరువు ఉన్నవారికి.

ఊబకాయం/అధిక బరువు ఉన్న పెద్దల్లో గుండె సమస్యల ప్రమాదం తగ్గడానికి.

ఇస్తారు

సెమాగ్లుటైడ్ అనేది GLP-1 హార్మోన్ లాగా పని చేస్తుంది. ఇది ఆకలిని తగ్గిస్తుంది, మెటబాలిజం ను పెంచుతుంది, ఇన్సులిన్ తయారీని పెంచుతుంది. కడుపు ఖాళీ అవడం నెమ్మదిస్తుంది.

అధ్యయనాల్లో వెగోవీ® అద్భుతంగా పని చేసింది:

1961 మంది పెద్దలు, 68 వారాల పాటుగా మందు వాడగా (సగటు బరువు 232 పౌండ్లు): 15% మేరకు బరువు తగ్గారు (~35 పౌండ్లు), అదే ప్లాసిబో ( మందు లేకుండా) తో 2.5% బరువు తగ్గారు (~6 పౌండ్లు). 83% మంది 5% పైగా, 66% మంది 10% పైగా, 48% మంది 15% పైగా బరువు తగ్గారు; 1/3 మంది 20% పైగా బరువు తగ్గారు.

మందును కొనసాగించిన వారు 68 వారాలు వరకు బరువు తగ్గుతూనే ఉన్నారు (అదే ప్లాసిబోలో బరువు పెరిగారు); 2 ఏళ్ల అధ్యయనంలో 15% తగ్గిన బరువు అలాగే కొనసాగింది.

12-17 ఏళ్ల పిల్లలు వెగోవీ® తో 16.1% బరువు తగ్గారు (అదే ప్లాసిబో వాడిన పిల్లలు 0.6% బరువు పెరిగారు).

వెగోవీ® ఇంజెక్షన్ చర్మం కింద వారానికి ఒక్కసారి తీసుకోవాలి.

1 నుంచి 4 వారం వరకు: 0.25 mg

5 నుంచి 8 వారం వరకు: 0.5 mg

9 నుంచి 12 వారం వరకు: 1 mg

13 నుంచి 16 వారం వరకు: 1.7 mg

17 వారం నుంచి: 2.4 mg

ఇంజెక్షన్ సరిగ్గా ఎలా తీసుకోవాలో మీ డాక్టరు దగ్గర తెలుసుకోవాలి. చర్మం సమస్యలు రాకుండా ఉండడానికి ఇంజెక్షన్ తీసుకునే చోటును మారుస్తూ ఉండాలి.

వెగోవీ® పెన్‌లు ఫ్రిజ్‌లో 2°C నుంచి 8°C వరకు ఉంచాలి. గది ఉష్ణోగ్రత వద్ద (30°C వరకు) 28 రోజులు ఉంచవచ్చు.

వెగోవీ® ఇంజెక్షన్ తో సాధారణంగా వచ్చేవి:

వికారం

విరేచనాలు

వాంతులు

మలబద్ధకం

కడుపు నొప్పి

కడుపు ఉబ్బరం

బలహీనత

తలనొప్పి

మొదటి సారి మరియూ మోతాదు పెంచిన సమయంలో సమస్యలు  వచ్చే అవకాశం ఎక్కువ.తర్వాత తగ్గిపోతాయి.

తీవ్రమైన సమస్యలు చాలా అరుదుగా వస్తాయి.

థైరాయిడ్ క్యాన్సర్: థైరాయిడ్ క్యాన్సర్ ఫ్యామిలీ హిస్టరీ ఉంటే వాడకూడదు.

ప్యాంక్రీయాస్ సమస్య (ప్యాంక్రీయాటైటిస్): కడుపు నొప్పి మరియూ వాంతులు, ఇతర ప్యాంక్రీయాటైటిస్ లక్షణాలు వస్తే ఇంజెక్షన్ ఆపాలి.

షుగర్ లెవల్స్ పడిపోవడం.

పిత్తాశయం లో రాళ్లు..

కళ్లు మసకబారడం/శాశ్వతంగా అంథకారం

కిడ్నీలు చెడిపోవడం

కడుపు నెమ్మదిగా ఖాళీ అయ్యే అవకాశం కారణంగా ఊపిరితిత్తులలో నెమ్ముచేరడం (ఆస్పిరేషన్ న్యుమోనియా): దీనిని నివారించడానికి ఏదైన సర్జరీ ప్లాన్ చేస్తుంటే 2 నెలలు ముందు ఇంజెక్షన్ ని ఆపాలి.

మహిళలు పిల్లలను కనడానికి ప్లాన్ చేసే 2 నెలలు ముందు ఇంజెక్షన్ ని ఆపాలి.

తీవ్రమైన అలర్జీలు: తీవ్రమైన రియాక్షన్ వస్తే వెంటనే ఆపి డాక్టర్ వద్దకి వెళ్లాలి.

వెగోవీ® ఇంజెక్షన్ స్థూలకాయ సమస్యతో బాధ పడుతున్న వారిలో బరువును తగ్గించడానికి ఉపయోగించే మందు. వారానికి ఒక ఇంజెక్షన్ తీసుకోవాలి

వెగోవీ® ఇంజెక్షన్ మీకు సరైనదో కాదో మీ డాక్టర్ ని సంప్రదించి డాక్టర్ సలహా మేరకు తీసుకోండి.

డా. అమర్ వెన్నపూస, హైదరాబాద్‌లోని డా. అమర్ బేరియాట్రిక్ & మెటబాలిక్ సెంటర్ డైరెక్టర్, ప్రసిద్ధ బేరియాట్రిక్ సర్జన్. ఇక్కడ ఊబకాయ సమస్యకు  వెగోవీ®, డయాబెటిస్‌ సమస్యకు ఒజంపిక్® మందులతో పాటు అవసరాన్ని బట్టి జీవనశైలిలో మార్పులు, మందులు, మరియు బేరియాట్రిక్ సర్జరీల వంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి.

CHECK YOUR BMI