ఇంజెక్షన్ మౌంజారో
-
డాక్టర్. అమర్ వెన్నపూస

మౌంజారో - ఎందుకు? ఏమిటి? ఎలా?
-
డాక్టర్. అమర్ వెన్నపూస

Eli Lilly కంపెనీ భారత్‌లో స్థూలకాయం (ఒబెసిటీ) మరియు మధుమేహం (డయాబెటిస్) చికిత్సకోసం మౌంజారో (Mounjaro) ఇంజెక్షన్ విడుదల చేసింది. ఈ ఇంజెక్షన్‌లో క్రియాశీలక మాలిక్యూల్ టిర్జెపాటైడ్ (Tirzepatide).

అమెరికాలో ఈ మాలిక్యూల్‌ ను Zepbound (బరువు తగ్గడం కోసం) మరియు Mounjaro (మధుమేహం చికిత్స కోసం) అనే రెండు బ్రాండ్ పేర్లతో విడుదల చేశారు.

కానీ భారత్‌లో, బరువు తగ్గడం మరియు మధుమేహం చికిత్స—ఈ రెండు ప్రయోజనాల కోసం మౌంజారో పేరుతోనే ఈ ఔషధాన్ని విడుదల చేశారు.

ఈ ఇంజెక్షన్ ఎలా పనిచేస్తుంది? ఎవరు దీనిని ఉపయోగించు కోవచ్చు? దాని దుష్ప్రభావాలు ఏమిటి? తెలుసుకుందాం.

– తీవ్రమైన స్థూలకాయం (Morbid Obesity) ఉన్న వారు దీర్ఘకాల బరువు తగ్గటానికి బారియాట్రిక్ సర్జరీ అవసరం.

– 5-10 కిలోల వరకూ అదనపు బరువు ఉన్న వారు జీవనశైలి మార్పులు చేస్తే సరిపోతుంది.

– అయితే, చాలా మంది ఈ రెండింటి మధ్య స్థాయిలో ఉంటారు— జీవన శైలి మార్పులతో బరువు తగ్గలేరు, కానీ బారియాట్రిక్ సర్జరీ అవసరమయ్యేంత స్థాయిలో కూడా ఉండరు.

– టిర్జెపాటైడ్ (Tirzepatide), సెమాగ్లుటైడ్ (Semaglutide) వంటి ఔషధాలు ఈ మధ్య స్థాయి వ్యక్తులకు ఉపయోగకరంగా ఉంటాయి.

– BMI 30+ లేదా BMI 27 మరియు డయాబెటిస్, రక్తపోటు, కొలెస్ట్రాల్ వంటి సమస్యలు ఉన్న పెద్దలకు

✔జీవనశైలి మార్పులతో బరువు తగ్గలేక పోతే మాత్రమే మౌంజారో వాడాలి.

✔బరువు లక్ష్యానికి చేరాక, జీవనశైలి మార్పులు కొనసాగించాలి.

✔కొంతమందికి బరువు తగ్గిన తర్వాత కొనసాగింపు డోస్ అవసరం.

– శరీరంలో 200 కి పైగా హార్మోన్లు శక్తి సమతుల్యత (Energy Balance) మరియు కొవ్వు నిల్వలను నియంత్రిస్తాయి. వీటిలో ఇంక్రెటిన్ (Incretin) హార్మోన్లు ముఖ్యమైనవి.

– ముఖ్యంగా GLP1 (Glucagon Like Peptide 1), PYY (Peptide YY), GIP (Gastric Inhibitory Peptide, Glucose Dependent Insulinotrophic Polypptide).

– GLP1, PYY చిన్నప్రేగు చివరి భాగం (Ileum) లోఉత్పత్తి అవుతాయి.

– GIP చిన్నప్రేగు మొదటి భాగం (Duodenum) లోఉత్పత్తి అవుతుంది.

– మౌంజారో GLP1 మరియు GIP లాగా పనిచేస్తుంది (Dual Hormonal Effect).

– మెదడుపై పనిచేసి ఆకలిని తగ్గిస్తుంది, మెటబాలిజాన్ని పెంచుతుంది, కొవ్వు నిల్వస్థాయిని తగ్గిస్తుంది.

– ప్యాంక్రియాస్‌ పై పనిచేసి ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచి మధుమేహాన్ని నియంత్రిస్తుంది.

శాస్త్రీయ అధ్యయనాల్లో, 72 వారాల్లో సగటున 15.4 నుండి 21.8 కిలోల వరకు బరువు తగ్గినట్లు తేలింది (15-20% మొత్తం శరీర బరువు).

• 75-90% మధుమేహ రోగుల్లో HbA1C 7% కంటే తక్కువకు తగ్గినట్లు తేలింది.

 

– వారానికి ఒకసారి (subcutaneous injection) తీసుకోవాలి.

– 2.5 mg తో ప్రారంభించి, ఫలితాలు & దుష్ప్రభావాలను బట్టి 5 mg, 7.5 mg, 10 mg, 12.5 mg, 15 mg వరకు పెంచుతాము.

1 – 4 వారాలు – 2.5 mg

5 – 8 వారాలు – 5 mg

9 – 12 వారాలు – 7.5 mg

13 – 16 వారాలు – 10 mg

17 – 20 వారాలు – 12.5 mg

21 – 24 వారాలు – 15 mg

– ఫలితాలు & దుష్ప్రభావాలను బట్టి డోసు ఎంత పెంచాలి అని నిర్ణయించబడుతుంది.
– డోసును పెంచాలా లేదా అదే మోతాదు కొనసాగించాలా అనేది మీ డాక్టరు నిర్ణయిస్థారు.
– బరువు తగ్గటం ఆగిపోయినా లేదా తగ్గాల్సిన బరువు లక్ష్యాన్ని చేరినా ఇంజక్షన్ 5 mg, 10 mg లేదా 15 mg మోతాదులో కొనసాగించాల్సిన అవసరం ఉంటుంది.

✅ భద్రతపరంగా మౌంజారో చాలా సురక్షితం.

❗తక్కువ పరిమాణంలో దుష్ప్రభావాలు:

• ఆకలి తగ్గడం

• పొత్తి కడుపు ఉబ్బరం, పొత్తి కడుపు నొప్పి

• వాంతులు, మలబద్ధకం లేదా విరేచనాలు

• ఇతర మధుమేహ మందులు వాడుతున్న వారిలో హైపో గ్లైసీమియా (రక్తంలోచక్కెర స్థాయిలు ప్రమాదకరంగా పడిపోవడం)

⚠ తీవ్రమైన దుష్ప్రభావాలు (అత్యంత అరుదుగా):

• దృష్టి మసక బారడం (డయాబెటిక్ రెటినోపథీ ఉన్నవారిలో ఎక్కువ అవకాశం)

• థైరాయిడ్ క్యాన్సర్ ప్రమాదం (MEN Type 2, Medullary Thyroid Cancer కుటుంబ చరిత్ర ఉన్న వారు వాడకూడదు)

• పిత్తాశయంలో రాళ్లు ఏర్పడే అవకాశం

• పాంక్రియాటైటిస్ (క్లోమగ్రంధి నొప్పి) వచ్చే అవకాశం

• శరీరంలో ద్రవ లోపం (Dehydration) → మూత్రపిండ సమస్యలు వచ్చే అవకాశం

• శస్రచికిస్థల ముందు మౌంజారో నిలిపివేయాలి (Gastric Emptying మందగించడం వల్ల Aspiration వచ్చే అవకాశం ఉంది).

❌ నకిలీ మౌంజారో ఇంజెక్షన్లు మార్కెట్‌లో దొరుకుతున్నాయి. వాటిని అసలు వాడకండి!

❌ డాక్టర్ సలహా లేకుండా వాడకండి.

CHECK YOUR BMI